శబరిమల ఆలయంలో పవిత్ర 'అరవణ ప్రసాదం' విక్రయాల నిలిపివేత

  • అయ్యప్ప భక్తులకు పవిత్రమైనది అరవణ ప్రసాదం
  • ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో రసాయనాలు
  • పరిమితికి మించి వాడారంటూ నివేదిక
  • ఇటువంటి యాలకులతో కూడిన ప్రసాదం విక్రయించరాదన్న హైకోర్టు 
అయ్యప్ప దీక్షలు విరమించేందుకు శబరిమల వెళ్లిన వారు తిరిగి వస్తూ అక్కడి నుంచి పవిత్ర అరవణ ప్రసాదం తీసుకువస్తుంటారు. బియ్యం, బెల్లం, నెయ్యి తదితర పదార్థాలు ఉపయోగించి తయారుచేసే ఆ ప్రసాదం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. 

శబరిమలలో అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలంటూ ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయన పదార్థాలు ఉంటున్నాయన్న నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు విక్రయాల నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చింది. 

అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు లేకుండా తయారుచేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని హైకోర్టు వెసులుబాటు కల్పించింది. లేదా, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని ట్రావెన్ కూర్ దేవస్వోం బోర్డుకు స్పష్టం చేసింది.


More Telugu News