నాన్నా.. నన్ను కొడుకుగా ఒప్పుకుంటారా? లేక డీఎన్ఏ పరీక్షకు వస్తారా?: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి శివచరణ్ ప్రశ్న
- తీవ్ర వివాదంలో మేకపాటి కుటుంబం
- ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటున్న శివచరణ్ రెడ్డి
- మీ ఆస్తులు అవసరం లేదు.. కొడుకుగా ఒప్పుకుంటే చాలంటున్న శివచరణ్
రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆర్థికంగా అత్యంత బలమైన మేకపాటి కుటుంబం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే ఉంది. అయితే, తాజాగా మేకపాటి శివచరణ్ రెడ్డి అనే యువకుడి కారణంగా మేకపాటి కుటుంబం తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ శివచరణ్ సోషల్ మీడియలో షేర్ చేసిన లేఖ కలకలం రేపుతోంది. ఆయన తల్లి కూడా చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. తమను వాడుకుని వదిలేశారని వీరు మండిపడుతున్నారు. తాజాగా శివచరణ్ రెడ్డి మరోసారి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు.
నాన్నా.. నన్ను మీ కుమారుడిగా మీడియా ముఖంగా ఒప్పుకోండి... లేదంటే డీఎన్ఏ పరీక్షకు రండి అంటూ ఆయన సవాల్ చేశారు. తాను ఇప్పటి వరకు చూపించిన ఆధారాలపై మీరు ఇంత వరకు స్పందించలేదని అన్నారు. తనకు మీ ఆస్తులు, రాజకీయ వారసత్వం అవసరం లేదని... కుమారుడిగా అంగికరిస్తే చాలని చెప్పారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.