ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్షకు హాల్ టికెట్ల విడుదల
- అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
- అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సూచన
- మొత్తం 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఏపీ సర్కారు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన సూచన.. రాతపరీక్ష కోసం హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గురువారం వెల్లడించింది. ఈ రోజు (గురువారం) నుంచి అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఏపీ పోలీస్ శాఖలో 6,511 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే! ఇందులో దాదాపు 6,100 ఖాళీలు కానిస్టేబుల్ పోస్టులేనని అధికారులు చెప్పారు. ఈ పోస్టులకు రాష్ట్రంలోని 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే సుమారుగా ఒక్కో ఉద్యోగానికి 83 మంది పోటీ పడుతున్నారు.
ఈ అభ్యర్థులు గురువారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష 3 గంటల పాటు జరుగుతుంది. ఇక ఎస్సై పోస్టులకు వచ్చే నెల 19న ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగుతుంది.