బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభం

  • హోసూరు - ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్య సర్వీసులు
  • 20 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం
  • ప్రతి వారం ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ
బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసూరు ఏరోడ్రోమ్ ను కలుపుతూ ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఫ్లైబ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలు జాయింట్ వెంచర్ గా ఈ సేవలను ప్రారంభించాయి. ఈ సేవల కోసం ప్రతి వారంలో ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. హోసూరు నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడానికి రోడ్డు మార్గంలో 3 గంటల సమయం పడుతోంది. హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. నిన్నటి నుంచి బ్లేడ్ ఇండియా వెబ్ సైట్ లో హెలికాప్టర్ సేవల బుకింగ్స్ తెరిచారు. 2019లో బ్లేడ్ ఇండియా సేవలను  ప్రారంభించింది. మహారాష్ట్రలో ముంబై, పూణె, షిర్డీల మధ్య ఈ సంస్థ హెలికాప్టర్లను నడుపుతోంది.


More Telugu News