తిరుమలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు
  • నిన్న అర్ధరాత్రితో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు
  • నేడు యథావిధిగా అన్ని సేవలు ప్రారంభం
  • టైమ్ స్లాట్ టికెట్లు ఉన్న వారికి నిర్ణీత సమయంలో దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న అర్ధరాత్రితో ముగిశాయి. ఈ రోజు నుంచి శ్రీవారి సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. టైమ్ స్లాట్ టికెట్లు పొందిన వారికి నిర్ణీత సమయంలో స్వామివారి దర్శనం లభిస్తోంది. 

మరోవైపు వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నడక మార్గంలో శాశ్వతంగా షెడ్లను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇంకోవైపు ఈరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం జరగనుంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో మాట్లాడాలనుకునే భక్తులు 0877-2263261 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.


More Telugu News