అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్

  • మంగళవారం సాయంత్రం కాల్ చేసిన దుండగుడు
  • ఇప్పటికి రెండు సార్లు బెదిరింపు కాల్స్ చేసిన దుండగుడు
  • స్కూల్ లో తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్
రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో టైమ్ బాంబ్ పెట్టానంటూ ఓ ఆగంతుకుడు చేసిన ఫోన్ కాల్ అందరికీ ముచ్చెమటలు పట్టించింది. స్కూలును పేల్చేస్తానని ఫోన్ లో దుండగుడు బెదిరించాడు. స్కూలు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి, తనిఖీలను నిర్వహించారు. 

అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు దొరకలేదు. బాంబు పెట్టామని దుండగుడు ఫోన్ చేయడం ఇది రెండోసారని స్కూలు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సైతం దుండగుడు స్కూలుకు పంపించాడని చెప్పింది. అతని పేరు విక్రమ్ సింగ్ అని, గుజరాత్ కు చెందిన అతను పాప్యులారిటీ కోసం ఇలా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్కూలు యాజమాన్యం తెలిపింది.


More Telugu News