నేను తెలంగాణలో ఉన్నా.. పక్క రాష్ట్రంలోని రాజకీయాల గురించి నాకెందుకు?: చిరంజీవి
- తన ఓటు హక్కు తెలంగాణలో ఉందన్న చిరంజీవి
- ఏపీ రాజకీయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదని వ్యాఖ్య
- తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావన్న మెగాస్టార్
ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో ఉంటున్నానని, తన ఓటు హక్కు కూడా ఇక్కడే ఉందని, పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి తనకెందుకని అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తనకు తెలియదని, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకు లేదని అన్నారు. తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. తాను వంద శాతం రాజకీయాల్లో లేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని అన్నారు.
ఇక తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావని చెప్పారు. తనకు విశాఖలో ఇల్లు ఉండాలని కోరుకున్నానని... అయితే తన కోరికకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. గతంలో తాను దర్శకుల గురించి చేసిన వ్యాఖ్యలు కొరటాల శివను ఉద్దేశించి చేసినవి కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.