విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్

  • విశాఖ, సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్
  • 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం  
  • రైలు సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. రెండు రాష్ట్రాలను కలుపుతూ విశాఖపట్నం, సికింద్రాబాద్ ల మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈరోజు విశాఖకు చేరుకుంది. ఈ రైల్లో పూర్తిగా చైర్ కార్ బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. 

విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఈ రైలు కేవలం 8.30 గంటల సమయంలోనే చేరుకుంటుంది. రైలు నిర్వహణ పర్యవేక్షణలో భాగంగానే ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ జెండాను ఊపి రైలును ప్రారంభించనున్నారు. అదే రోజున రూ. 699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను కూడా శంకుస్థాపన చేయనున్నారు.


More Telugu News