శ్రీశైలం ఆలయం లడ్డూ తయారీలో భారీ అవినీతి జరుగుతోంది: ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి
- లడ్డూల తయారీ సరుకు కొనుగోళ్లలో లక్షలాది రూపాయల అవకతవకలు
- రూ. 42 లక్షల గోల్ మాల్ జరిగిందన్న ఆలయ ఛైర్మన్
- కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరఫరా చేస్తున్నారని వెల్లడి
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో భారీ అవినీతి భాగోతం బయటపడింది. లడ్డూల తయారీ సరుకు కొనుగోళ్లలో లక్షలాది రూపాయల అవకతవకలు జరిగాయి. లడ్డూ తయారీ సరుకుల రేట్లలో నవంబర్ నెలలో రూ. 42 లక్షల గోల్ మాల్ జరిగిందనే విషయాన్ని గుర్తించామని ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. లడ్డూ తయారీకి కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో, మార్కెట్ రేట్ కంటే అధిక ధరకు సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తమ అంతర్గత విచారణలో ఈ విషయం తెలిసిందని... ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
లడ్డూ తయారీకి సరుకులు ఇస్తున్న కాంట్రాక్టును రద్దు చేసేందుకు గత నెలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. అయితే ఇంతవరకు కాంట్రాక్టు రద్దుకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్ట్ రద్దు చేయలేదని చెప్పారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని... రానున్న ఫిబ్రవరి, మార్చి నెలలను కూడా కలుపుకుంటే కనీసం రూ. కోటి తేడా వచ్చే అవకాశం ఉందని అన్నారు.