'రీ బిల్డ్ ఏపీ' పేరుతో సదస్సులను ప్రారంభించిన తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్
- టీడీపీ అనుబంధ విభాగం తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్
- పలు చోట్ల రీ బిల్డ్ ఏపీ పేరిట అవగాహన సదస్సులు
- రాష్ట్ర పరిస్థితుల పట్ల యువతలో చైతన్యం కలిగించడమే ఉద్దేశం
టీడీపీ అనుబంధ విభాగం తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ (టీపీడబ్ల్యూ) 'రీ బిల్డ్ ఏపీ' పేరుతో యువతకు అవగాహనా సదస్సులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజమండ్రి , బాపట్ల, మరియు తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాలలో మొదటి విడత అవగాహనా సదస్సులను ప్రారంభించారు.
గత మూడు సంవత్సరాలుగా ఏపీ తిరోగమనం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు రాకపోవడం, రాజధాని నిర్మాణం ఆగిపోవడం వంటి పరిస్థితుల పట్ల చలించిన ప్రతి ఒక్కరు ఇందులో భాగం అయ్యేలా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వారు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రాష్ట్ర సంక్షేమాన్ని, ప్రగతిని కాంక్షించి సుపరిపాలనను అందించాల్సిన అవసరాన్ని మరియు రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా యువతను, వృత్తి నిపుణులను ఏకం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం గూర్చి తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.