సెంచరీతో కుమ్మేసిన కోహ్లీ... భారత్ 50 ఓవర్లలో 373-7

  • గువాహటిలో టీమిండియా వర్సెస్ శ్రీలంక
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చిన లంక
  • లంక బౌలర్లను ఉతికారేసిన భారత టాపార్డర్
  • 113 పరుగులు చేసిన కోహ్లీ
  • వన్డే కెరీర్ లో 45వ సెంచరీ నమోదు
శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీకి తోడు, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ భారీ ఇన్నింగ్స్ లు ఆడడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీనే హైలైట్. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 113 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డే పోటీల్లో కోహ్లీకిది 45వ సెంచరీ. 

అంతకుముందు, రోహిత్ శర్మ 83, గిల్ 70 పరుగులు చేసి శుభారంభం అందించడంతో భారత్ భారీ స్కోరుకు సరైన పునాది పడింది. కోహ్లీకి శ్రేయాస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) నుంచి చక్కని సహకారం లభించింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా బ్యాట్స్ మెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ లంక బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 

శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీసినా, అతడు 10 ఓవర్లలో సమర్పించుకున్న పరుగులు 88. మధుశంక 1, కరుణరత్నే 1, షనక 1, ధనంజయ డిసిల్వా 1 వికెట్ తీశారు.


More Telugu News