హైదరాబాదులో నారా లోకేశ్ ను కలిసిన గంటా శ్రీనివాసరావు

  • లోకేశ్ తో దాదాపు 40 నిమిషాల మీటింగ్ 
  • పార్టీ పరమైన అంశాలతో పాటు ఇతర విషయాలపై చర్చ
  • కొంతకాలంగా టీడీపీకి ఎడంగా ఉంటున్న గంటా
  • ఈ నేపథ్యంలో లోకేశ్ తో భేటీకి ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీ పరంగా ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిసారు. గత ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావుకు, టీడీపీకి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో గంటా పెద్దగా పాల్గొన్నది లేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ తో గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇవాళ జూబ్లీహిల్స్ లోని లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. పార్టీ పట్ల తన వైఖరిని ఆయన లోకేశ్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్టు సమాచారం. 

అప్పట్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఇటీవల గంటా, తదితర నేతలతో ఓ కాపు వేదిక ఏర్పాటైంది. ఈ వేదిక ద్వారా కాపుల సంక్షేమంపై తన బాణీ వినిపిస్తున్నారు.


More Telugu News