రోహిత్ శర్మ, గిల్ విజృంభణ... భారీ స్కోరు దిశగా భారత్

  • గువాహటిలో శ్రీలంకతో తొలి వన్డే
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • తొలి వికెట్ కు 143 రన్స్ జోడించిన రోహిత్, గిల్
  • 29 ఓవర్లలో 2 వికెట్లకు 213 రన్స్ చేసిన భారత్
శ్రీలంకతో తొలివన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. గువాహటిలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. వీళ్లిద్దరూ 19.4 ఓవర్లలో 143 పరుగులు జోడించి తొలి వికెట్ కు పటిష్ఠ భాగస్వామ్యం నమోదు చేశారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, యువ ఆటగాడు గిల్ 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది. 

ప్రస్తుతం భారత్ స్కోరు 29 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు. కోహ్లీ 30, అయ్యర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ దసున్ షనక, మధుశంక చెరో వికెట్ పడగొట్టారు.


More Telugu News