గగనతలంలో తెరుచుకున్న విమానం డోర్.. వణికిపోయిన ప్రయాణికులు

  • రష్యాకు చెందిన ఇర్ ఎయిరో విమానంలో ఘటన
  • ఒక్కసారిగా తెరుచుకున్న వెనుక డోర్
  • దిశను మార్చి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్
రష్యాకు చెందిన ఓ విమానం డోర్ ప్రయాణం మధ్యలో తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఉలిక్కిపడ్డారు. ఏఎన్ 26 ట్విన్ ప్రాప్ విమానంలో ఇది జరిగింది. ఇర్ ఎయిరో సంస్థకు చెందిన విమానం సైబీరియాలోని మగాన్ నుంచి టేకాఫ్ తీసుకుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 41 డిగ్రీలుగా ఉంది. రష్యా పసిఫిక్ తీరంలోని మగాన్ కు వెళుతుండగా మధ్యలో విమానం వెనుక డోర్ తెరుచుకుంది.

దీన్ని ఓ ప్రయాణికుడు తన ఫోన్లో రికార్డు చేశాడు. ఇది ట్విట్టర్ లోకి చేరింది. ఆ సమయంలో విమానంలో 25 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు క్రూ సిబ్బంది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాలేదు. విమానం దిశను మార్చుకుని మగాన్ లో ల్యాండ్ అయింది. 2800-2900 మీటర్ల ఎత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఇర్ ఎయిరో తెలిపింది. ఈ వీడియోను ఉక్రెయిన్ హోం మంత్రి సలహాదారు ఆంటోన్ గెరాన్ షెకో షేర్ చేశారు. ఇర్ ఎయిరో రష్యాకు చెందిన విమానయాన సంస్థ.


More Telugu News