'అన్ స్టాపబుల్ 2' వేదికపై 'వీరసింహారెడ్డి' టీమ్

  • మాస్ యాక్షన్ మూవీగా 'వీరసింహారెడ్డి'
  • ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై ఈ సినిమా టీమ్ సందడి 
  • సంక్రాంతి కానుకగా జరగనున్న స్ట్రీమింగ్ 
'ఆహా'లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఒక ఎపిసోడ్ కి మించి మరో ఎపిసోడ్ ను అందిస్తూ వెళుతున్నారు. ఇటీవల స్ట్రీమింగ్ చేసిన ప్రభాస్ ఎపిసోడ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ వేదికపై 'వీరసింహారెడ్డి' సినిమా టీమ్ సందడి చేయనుంది. అందుకు సంబంధించిన షూటింగు జరిగిపోయింది. ఆ ఎపిసోడ్ తాలూకు ఫొటోలను వదిలారు. దర్శక నిర్మాతలతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ .. హనీరోజ్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్టుగా ఫొటోల ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు.శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగులు .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని అంటున్నారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News