వ్యక్తిగత రుణాలపై ఈ బ్యాంకుల్లో తక్కువ రేట్లు

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకుల్లో తక్కువ రేట్లు
  • క్రెడిట్ స్కోర్ ఆధారంగా మారిపోయే రేటు
  • గరిష్ఠంగా రూ.కోటి వరకు తీసుకునే వెసులుబాటు
నేడు చాలా మంది ఎన్నో అవసరాల కోసం పర్సనల్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్ రుణాలు, వ్యక్తిగత రుణాలపై రేట్లు ఎక్కువ. కనుక తప్పనిసరి అయితేనే వీటిని తీసుకోవాలి. పైగా తీసుకున్న తర్వాత వీలైనంత త్వరగా తీర్చేయాలి. అప్పుడు రుణాలు భారం కాకుండా చూసుకోవచ్చు. వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకునే వారు తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకులను పరిశీలించడం ఉత్తమం. పర్సనల్ లోన్స్ అన్నీ కూడా ఫిక్స్ డ్ రేటుపై మంజూరు అయ్యేవే. అంటే తీసుకునే నాటికి ఉన్న వడ్డీ రేటు టర్మ్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. 

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 లక్షల వరకు రుణాన్ని గరిష్ఠంగా 84 నెలల కాలానికి 9.10 శాతం రేటుపై ఆఫర్ చేస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.20 లక్షల వరకు రుణాలను గరిష్ఠంగా 84 నెలల వరకు 9.25 శాతం రేటుకు ఇస్తోంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.10 లక్షల వరకు రుణాలను 60 నెలల కాలానికి 10.15-16.70 శాతం రేట్లపై ఇస్తోంది.
  • కరూర్ వైశ్యా బ్యాంక్ రూ.10 లక్షల వరకు రుణాలను గరిష్ఠంగా 60 నెలల కాలవ్యవధిపై 10.20-13.20 శాతం రేటుపై ఆఫర్ చేస్తోంది.
  • ఐడీబీఐ బ్యాంక్ రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను 12-60 నెలల కాలవ్యవధులపై అందిస్తోంది. వడ్డీ రేటు 10.25-15.50 శాతం మధ్య ఉంటుంది.
  • ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ రూ.కోటి వరకు వ్యక్తిగత రుణం కింద ఇస్తోంది. దీనిపై 10.49 శాతం రేటు వసూలు చేస్తోంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్ సైతం రూ.25 లక్షల వరకు రుణాలను 10.49-26.50 శాతం రేటుపై ఇస్తోంది.
  • ఇండియన్ బ్యాంక్ రూ.5 లక్షల వరకు రుణాన్ని 10.65-12.15 శాతం రేటుపై ఇస్తోంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 లక్షల వరకు రుణాలను 10.75-19 శాతం రేట్లపై ఇస్తోంది. 
  • క్రెడిట్ స్కోర్ 760కిపైన ఉన్న వారికి ఒక విధంగా, 800కు పైన ఉన్న వారికి మరొక విధంగా ఉండొచ్చు. అలాగే, 750 స్కోర్ కంటే తక్కువ ఉండే వారికి తక్కువ రేట్లపై బ్యాంకులు ఆఫర్ చేయవు.


More Telugu News