బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల రేట్లకు రెక్కలు?

  • జాబితాలో ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు
  • 35 ఉత్పత్తులతో జాబితా సిద్ధం
  • ఎన్నింటిపై కస్టమ్స్ సుంకం పెంపు అన్నది బడ్జెట్ తర్వాతే స్పష్టత 
ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో తదుపరి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పెంపును ఆమె ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ద్రవ్యపరమైన క్రమశిక్షణ పాటిస్తూనే, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించనున్నారు. కస్టమ్స్ సుంకం పెంపునకు ఉద్దేశించిన 35 ఉత్పత్తులతో అధికారులు ఒక జాబితాను రూపొందించారు. వీటిపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రైవేటు జెట్ లు, హెలికాప్టర్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, జ్యుయలరీ, హై గ్లాస్ పేపర్ ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు. నిత్యావసరం కాని వస్తువుల జాబితాను రూపొందించాలంటూ కేంద్ర వాణిజ్య శాఖ గత నెలలో అన్ని మంత్రిత్వ శాఖలను కోరడం గమనార్హం. నిత్యావసరం కాని వాటిని ఎక్సైజ్ సుంకం పరిధిలోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. దీనివల్ల అనవసర దిగుమతులను తగ్గించడంతోపాటు, ఆదాయం పెంచుకునే వ్యూహం కనిపిస్తోంది. 




More Telugu News