గడపగడపకూ కార్యక్రమంలో దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం
- రాణిగారితోటలో మహిళల ఆగ్రహం
- మీ కోసం పని చేసినా.. మోసం చేశారంటూ కార్పొరేటర్ పై ఆగ్రహం
- మౌనంగా ఉండిపోయిన దేవినేని అవినాశ్
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జీ దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం ఎదురయింది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి అవినాశ్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని గమనించిన అవినాశ్.... ఈ జెండా మనం పెట్టిందేనా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... మీరు గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామని ఆమె చెప్పారు. దీంతో, అవినాశ్ మౌనంగా ఉండిపోయారు. మీ వెంటే తిరిగామని, అయినా తమకు మోసం జరిగిందని కార్పొరేటర్ ను చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.