వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తుంది: కిషన్ రెడ్డి
- తెలంగాణ, ఏపీ మధ్య వందేభారత్ రైలు
- ఇటీవల భారత రైల్వే ప్రకటన
- సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తుందని కిషన్ రెడ్డి వెల్లడి
- ఈ నెల 19న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని వివరణ
భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెమీ హైస్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందన్న దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత నిచ్చారు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తుందని వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలును ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.