చంద్రబాబు, పవన్ కలవకూడదని జీవో నెం.2 తెస్తారేమో: టీడీపీ ఎమ్మెల్యే అనగాని వ్యంగ్యం

చంద్రబాబు, పవన్ కలవకూడదని జీవో నెం.2 తెస్తారేమో: టీడీపీ ఎమ్మెల్యే అనగాని వ్యంగ్యం
  • హైదరాబాదులో చంద్రబాబు, పవన్ భేటీ
  • తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ మంత్రులు
  • 12 మంది మంత్రులు స్పందించారన్న అనగాని సత్యప్రసాద్
  • బాబు, పవన్ భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమవుతారో అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ కావడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. తమ శాఖల పురోగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ భేటీపై మాత్రం స్పందిస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబు, పవన్ కాఫీకి కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారు... ఇక ఇద్దరూ కలిసి భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమైపోతారో! అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ చంద్రబాబు, పవన్ కలవకూడదంటూ జీవో నెం.2 తీసుకువస్తారేమో అంటూ అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

నిన్న హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ రాక తెలిసిందే. ఇరువురు దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. జీవో నెం.1 తదితర అంశాలపై చర్చించుకున్నారు. అయితే, వైసీపీ మంత్రులు ఈ సమావేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News