భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 241 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభాలను ముందుండి నడిపించిన ఐటీ, పవర్ సూచీలు
గత కొన్ని సెషన్లుగా నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ, అమెరికా ఉద్యోగ గణాంకాలు, చైనా ఆంక్షల సడలింపు, రూపాయి స్వల్పంగా బలపడటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెట్ ను బలపరిచాయి. 

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 847 పాయింట్లు లాభపడి 60,747కి చేరుకుంది. నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 18,101కి ఎగబాకింది. టెక్, ఐటీ, పవర్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.59%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.37%), టీసీఎస్ (3.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.06%), టెక్ మహీంద్రా (2.92%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-2.12%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.21%), మారుతి (-0.09%).


More Telugu News