కుప్పంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా: చంద్రబాబు

  • కుప్పంలో అరెస్టుల పర్వం అంటూ మీడియాలో వార్త
  • పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ లు రాస్తున్నారన్న చంద్రబాబు
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం అని విమర్శ  
తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కుప్పంలో మొదలైన టీడీపీ నేతల అరెస్టుల పర్వం అంటూ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. పోలీసులే తప్పుడు ఫిర్యాదులతో నాలుగు తప్పుడు ఎఫ్ఐఆర్ లు రాసి అరెస్టులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యలు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. 

ఎఫ్ఐఆర్ లో 'ఇతరులు' అని పెట్టి... వైసీపీ నేతల సూచనల ప్రకారం టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసిన ఎస్ఐలు, సీఐలు, వెనకుండి కథ నడిపిస్తున్న డీఎస్పీలు, ఎస్పీలు తాము చేస్తున్న తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.


More Telugu News