సూర్యలాంటి ఆటగాడు 100 ఏళ్లకు ఒక్కసారే వస్తాడు: కపిల్ దేవ్
- ఎంతో సునాయాసంగా సిక్సర్లుగా మలచగలడన్న కపిల్
- బ్యాటింగ్ ను ఎలా వర్ణించాలో మాటలు రావడం లేదని వ్యాఖ్య
- అలాంటి బ్యాట్స్ మ్యాన్ ను కొద్ది మందినే చూశానని ప్రకటన
శ్రీలంక సిరీస్ లో రాణించిన సూర్యకుమార్ పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ కూడా స్పందించాడు. సచిన్ టెండూల్కర్, వివీ రిచర్డ్స్ తదితర దిగ్గజాల బ్యాటింగ్ శైలితో సూర్యకుమార్ స్టయిల్ ను కపిల్ దేవ్ పోల్చడం గమనార్హం.
గత శనివారం రాజ్ కోట్ లో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ కొట్టడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కేవలం 51 బంతుల్లో 112 పరుగులు సాధించాడు సూర్య. ఇందులో 9 సిక్సర్లు కాగా, 7 బౌండరీలు ఉన్నాయి. అంటే 82 పరుగులు క్రీజు నుంచి కదలకుండానే పిండుకున్నాడు. అంతేకాదు సదరు మ్యాచ్ లో అతడు నాటౌట్ గా ఉండడం విశేషం. టీ20ల్లో అత్యధిక వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు. మొదటి రికార్డ్ రోహిత్ శర్మ (35 బంతుల్లో సెంచరీ) పేరిట ఉంది. 45 బంతుల్లో సూర్య సెంచరీ సాధించడం గమనార్హం.
‘‘కొన్ని సందర్భాల్లో అతడి బ్యాటింగ్ ను ఎలా వర్ణించాలో కూడా నాకు మాటలు రావడం లేదు. భారత్ లో ఎంతో ట్యాలెంట్ ఉంది. మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సూర్య చేసే సిక్సర్ బౌలర్లకు కష్టతరంగా మారుతుంది. గొప్ప బ్యాటర్లు అయిన డీవిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రికీ పాంటింగ్ వంటి వారిని చూశాను. కానీ, సూర్య మాదిరి సునాయాసంగా బాల్ ను కొట్టగలిగేది కొద్ది మందే. సూర్యకుమార్ కు హ్యాట్సాఫ్. ఇలాంటి వారు శతాబ్దానికి ఒక్కసారే వస్తారు’’ అని కపిల్ దేవ్ అన్నాడు. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ గెలవడం తెలిసిందే.