ఇప్పుడు విలన్ రోల్స్ కూడా హీరోలే చేస్తున్నారు .. మా వరకూ రానీయడం లేదే: నటుడు అజయ్
- 'విక్రమార్కుడు' విలన్ గా ఫేమస్ అయిన అజయ్
- ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ
- అడపాదడపా హీరోగాను మెప్పిస్తున్న అజయ్
- 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో తన కెరియర్ ముచ్చట్లు
తెలుగు తెరపై విలన్ పాత్రల ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసిన నటుడిగా అజయ్ కనిపిస్తాడు. ఆ తరువాత కాలంలో ఆయన ఫామిలీ ఆడియన్స్ ను మెప్పించే పాత్రలను కూడా పోషిస్తూ వెళుతున్నాడు. అడపాదడపా హీరో పాత్రలను కూడా పోషిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాడు.
" మాది విజయవాడ .. నా హైటు చూసుకునే సినిమాల్లోకి వచ్చాను. హైదరాబాదులో ఒక షూటింగ్ చూసినప్పుడు, సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. 'విక్రమార్కుడు' సినిమాలో విలన్ రోల్ చేసిన తరువాత, నేనంటే చిన్నపిల్లలు భయపడేవారు. చాలామంది నా దగ్గరికి కూడా వచ్చేవారు కాదు. ఒక రకంగా ఆ రోల్ పోషించడంలో నేను సక్సెస్ అయ్యానని అనుకున్నాను" అన్నాడు.
"నేను హైటు ఎక్కువగా ఉండటం వలన ప్రభాస్ .. మహేశ్ బాబు సినిమాలలో తప్పించి, మిగతా హీరోల సినిమాలలో ఫ్రెండ్ కేరక్టర్స్ కి తీసుకునేవారు కాదు. స్ట్రాంగ్ విలన్ రోల్స్ కి సంబంధించిన వేషాలు మాత్రం ఇచ్చేవారు. మా కంటే ముందు ముంబై విలన్స్ కి ఇక్కడ డిమాండ్ ఉండేది. ఇక ఇప్పుడు హీరోలే విలన్ వేషాలు కూడా వేస్తున్నారు. విలన్ వేషాలు మా వరకూ ఎక్కడ వస్తున్నాయి?" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.