పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
- వనౌటు ద్వీపం వద్ద భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత
- సునామీ హెచ్చరిక జారీ
- ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు తీసిన ప్రజలు
- కాసేపటికి సునామీ హెచ్చరిక ఉపసంహరణ
భూకంపాలకు నెలవైన పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ ద్వీపదేశం వనౌటు తీరానికి సమీపంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. పోర్ట్ ఓల్రీ అనే గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో 27 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
భారీ ప్రకంపనలతో వనౌటుతో పాటు, న్యూకలెడోనియా, సాల్మన్ ఐలాండ్స్ కు కూడా సునామీ హెచ్చరిక జారీ అయింది. దాంతో ప్రజలు సమీపంలోని ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు తీశారు. అయితే, కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని వనౌటులోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం సూచించింది.
కాగా, కొందరు ప్రజలు తమ నివాసాల్లో భూకంపం ప్రభావంతో నష్టం వాటిల్లినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. న్యూజిలాండ్ కూడా ఈ పవర్ ఫుల్ భూకంపంపై స్పందించింది. సునామీ భయమేమీ లేదని స్పష్టం చేసింది.