మెగాస్టార్ ఆవేశంలో నుంచి పుట్టినవాడే పవన్ కల్యాణ్: 'వాల్తేరు వీరయ్య' ఈవెంటులో బాబీ

  • చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చానన్న బాబీ   
  • మెగాస్టార్ తో సినిమా చేయడానికి 20 ఏళ్లు పట్టిందని వివరణ 
  • రవితేజ వల్లనే ఈ స్థాయికి వచ్చానంటూ కృతజ్ఞతలు 
  • చిరూ ఆవేశం .. మంచితనం పవన్ కి వచ్చాయని వ్యాఖ్య
దర్శకుడిగా ఒక్కో సినిమాతో తానేమిటనేది నిరూపించుకుంటూ బాబీ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి 'వాల్తేరు వీరయ్య' రెడీ అవుతోంది. వైజాగ్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో బాబీ మాట్లాడుతూ .. "చిరంజీవిగారి అభిమానిగా 'ఇంద్ర' సినిమా చూసిన తరువాత నా లక్ష్యం ఏమిటనేది అర్థమైంది .. దాంతో ఇండస్ట్రీకి వచ్చాను" అన్నాడు. 

"చిరంజీవిగారికి మా నాన్నగారు కరడుగట్టిన ఫ్యాన్. ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్లకి చిరంజీవిగారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గూగుల్ లో నాకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకా ఏం కావాలి. రాజకీయాలలో ఎదురుదాడి చేయరు ఎందుకని అని నేను ఒకసారి చిరంజీవిగారిని అడిగితే, వాళ్లకి అమ్మానాన్నలు .. అక్కా చెల్లెళ్లు ఉంటారు .. వాళ్లు బాధపడతారు" అన్నారు. ఆయన మంచితనం ఎలాంటిదో అప్పుడు నాకు అర్థమైంది. 

'అన్నయ్యా .. రాజకీయాలు మీకు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు .. ఆయన చూసుకుంటాడు .. ఆయన సమాధానం చెబుతాడు .. ఆయన గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం .. మంచితనం కలిస్తే పవన్ కల్యాణ్. మాటకి మాట ... కత్తికి కత్తి పవర్ స్టార్. ఇక ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారణం రవితేజనే. 'పవర్' సినిమాతో ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే ఇక్కడి వరకూ వచ్చాను" అంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.


More Telugu News