తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో సదస్సు... హాజరైన నారా లోకేశ్

  • పబ్లిక్ పాలసీపై సదస్సు నిర్వహించిన టీడీపీ అనుబంధ విభాగం
  • విచ్చేసిన ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
  • అనుభవాలను, అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్న మాంటెక్ సింగ్, లోకేశ్
టీడీపీ అనుబంధ విభాగం 'తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్' ప్రతిష్ఠాత్మక రీతిలో పబ్లిక్ పాలసీ - ఇంటర్న్షిప్ సదస్సు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. వారు తమ అభిప్రాయాలను, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సుమారు గంటన్నరకు పైగా సాగిన కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

ముఖ్యంగా మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా అనుభవం, 1991 ఆర్థిక సంస్కరణల ప్రభావం, వాటి వెనుక కృషి విద్యార్థులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక, నారా లోకేశ్ వరల్డ్ బ్యాంకు ఉద్యోగ అనుభవం మరియు పబ్లిక్ పాలసీల ప్రాముఖ్యత గూర్చిన విపులీకరణ ఆయనలోని కొత్త కోణాల్ని పరిచయం చేసింది. 

తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోర్ కమిటీ సభ్యులు కూడా పాల్గొని వివిధ రకాల ప్రశ్నలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు వివిధ రాష్ట్రాల నుండి హాజరైన విద్యార్థులు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, నారా లోకేశ్ లతో ముఖాముఖిలో పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News