మెగా డాన్సులు చూసి ఇండస్ట్రీకి వచ్చాను : దేవిశ్రీ

  • వైజాగ్ లో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • స్టేజ్ పై సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్ 
  • రవితేజ సినిమాతోనే మాస్ బీట్లు మొదలెట్టానని వెల్లడి
  • అభిమానులందరం కలిసి చేసిన సినిమా ఇది అని వ్యాఖ్య  

చిరంజీవీ - బాబీ కాంబినేషన్లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఈ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ నెల 13వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును విశాఖలో నిర్వహించారు. ఈ సినిమాలో కేథరిన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించగా, ఊర్వశీ రౌతేలా ఐటమ్ నెంబర్ లో మెరిసింది. ఈ వేదికపై రెడ్ కలర్ డ్రెస్ లో ఊర్వశీ రౌతేలా మెరిసిపోగా, వైట్ కలర్ డ్రెస్ లో కేథరిన్ విరిసింది. 

ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ .. "చిరంజీవి సినిమాలను చూసి బాబీ డైరెక్టర్ అయ్యాడు .. ఆయన మాస్ ఇమేజ్ చూసి రవితేజ హీరో అయ్యాడు .. చిరూ డాన్సులు చూసి నేను మ్యూజిక్ డైరెక్టర్ ను అయ్యాను. ఇక చిరంజీవితో ఒక సినిమా చేస్తే చాలనుకుని మైత్రీ వారు ఇండస్ట్రీకి వచ్చారు. అలా అందరం కలిసి చేసిన సినిమానే 'వాల్తేరు వీరయ్య' అన్నారు. 

"బాబీ ఈ కథకి న్యాయం చేశాడు .. నా బాణీలను తన మాస్ స్టెప్పులతో శేఖర్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఇక రవితేజ ఎనర్జీ లెవెల్స్ కూడా ఈ సినిమా దూకుడుకి తోడయ్యాయి. ఆయన సినిమాతోనే నేను మాస్ బీట్స్ చేయడం మొదలెట్టాను' అన్నారు. ఇక ఊర్వశీ రౌతేలా - కేథరిన్ మాట్లాడుతూ, ఇలాంటి ఒక మెగా మూవీలో నటించడం తమ అదృష్టమంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News