అమ్మా .. నాన్న .. ఓ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంటులో కోన వెంకట్!
- విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్
- భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు
- బాబీపై ప్రశంసలు కురిపించిన కోన వెంకట్
- చరిత్ర సృష్టిస్తుందంటూ వ్యాఖ్య
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును వైజాగ్ లో నిర్వహించారు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించిన కోన వెంకట్ మాట్లాడుతూ .. "మెగా స్టార్ అంటే స్వయంకృషి .. మెగాస్టార్ అంటే పట్టుదల. అలనాటి మెగాస్టార్ సినిమాకి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆయన కొన్ని వందల మందికి బ్యాక్ గ్రౌండ్ గా మారారు. బాబీ ఈ కథలో తన కష్టాన్ని .. మెగాస్టార్ పట్ల ప్రేమను .. అభిమానాన్ని మిక్స్ చేశాడు. అందుకే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది" అన్నారు.
తెలుగువారి ఇళ్లలో 'అమ్మ నాన్న ఓ మెగా స్టార్' అన్నట్టుగా ఆయన అందరి ఇళ్లలో ఒక భాగమైపోయారు. ఇంతటి మెగా సినిమా చేయాలంటే మెగాహార్ట్ ఉండాలి .. మెగా ప్యాషన్ ఉండాలి. మైత్రీవారికి అవి ఉన్న కారణంగా ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి గొప్ప మ్యూజిక్ ను అందించాడు. చరిత్రలో ఈ సినిమా తప్పకుండా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పగలను" అంటూ ముగించారు.