టీడీపీలో లోకేశ్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించకపోవచ్చు: లక్ష్మీపార్వతి
- కొడుకు, కోడలుతో తిరుమల విచ్చేసిన లక్ష్మీపార్వతి
- శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాటామంతీ
- టీడీపీలోకి ఎన్టీఆర్ రాకపోవచ్చని వ్యాఖ్యలు
ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడుకు, కోడలు సహా తిరుమల విచ్చేసిన ఆమె శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అంశాలపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుందని లక్ష్మీపార్వతి బదులిచ్చారు. తనకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ టీడీపీలోకి రావడంలేదని అన్నారు.
ఎన్నికల ముందు వీళ్లు చాలా అబద్ధాలు సృష్టిస్తుంటారని, అందులో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. ఎందుకంటే, లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తాడని భావిస్తున్నానని తెలిపారు.