సూపర్ ఫీచర్లు.. 20 నిమిషాల్లోనే చార్జింగ్.. రెడ్ మీ 12 ప్రో ప్లస్ విడుదల
- దీని ధర రూ.29,999
- ఐసీఐసీఐ కార్డుపై రూ.3,000 డిస్కౌంట్
- రెడ్ మీ 12, 12 ప్రో వేరియంట్లు సైతం విడుదల
మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరకు రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ను షావోమీ విడుదల చేసింది. 120 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఫోన్ తోపాటు స్క్రీన్ ప్రొటెక్టర్, టీపీయూ బ్యాక్ కేస్ ను కూడా కంపెనీయే అందిస్తోంది.
6.7 అంగుళాల డిస్ ప్లే ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్, డ్యూయల్ స్పీకర్ సెటప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనుక భాగంలో 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల బ్లర్ కాకుండా ఫొటోలు తీసుకోవడానికి వీలవుతుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.
డిస్ ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. స్ల్పాష్ ప్రూఫ్, ఐపీ 53 రేటింగ్ లభించింది. 4980 ఎంఏహెచ్ బ్యాటరీని 0 నుంచి 100 శాతం చార్జింగ్ ను కేవలం 19 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఇక ఫోన్ లో బ్యాటరీ పవర్ 30 శాతం ఉన్నప్పుడు చార్జింగ్ పెడితే కేవలం 11-12 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీని ధర రూ.29,999 నుంచి మొదలవుతుంది.
ఈ ఫోన్ తో పాటు రెడ్ మీ 12, 12 ప్రోను సైతం షావోమీ విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 12 ధర రూ.17,999 నుంచి, రెడ్ మీ 12 ప్రో ధర రూ.26,999 నుంచి మొదలవుతుంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్, రెడ్ మీ పోర్టళ్లపై, విజయ్ సేల్స్ దుకాణాల్లో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పై కొనగోలు చేస్తే ఆరంభ ఆఫర్ కింద రూ.1500 తగ్గింపు పొందొచ్చు. రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ మాత్రం ఫ్లిప్ కార్ట్ పై ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటలకు విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ కార్డుపై రూ.3,000 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.26,999కే సొంతం చేసుకోవచ్చు.