వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ కోసం విశాఖ బయల్దేరిన చిరంజీవి
- ఈవెంట్ వేదిక మార్పుపై నో కామెంట్: మెగాస్టార్
- అభిమానుల అంచనాలను అందుకుంటామని వెల్లడి
- విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ రోజు సాయంత్రం ఫంక్షన్
మెగస్టార్ చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం విశాఖలో జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిరంజీవి విశాఖకు బయలుదేరారు. తన కూతుళ్లు సుస్మిత, శ్రీజలతో కలిసి చిరంజీవి మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులు మాట్లాడించేందుకు ప్రయత్నించగా.. పలు ప్రశ్నలకు క్లుప్తంగా జవాబిస్తూ ముందుకుసాగారు.
వాల్తేరు వీరయ్య సినిమాపై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయన్న ప్రశ్నకు.. అన్ని అంచనాలను అందుకుంటామని మెగాస్టార్ బదులిచ్చారు. అయితే, ప్రీ రిలీజ్ వేదికను మార్చడంపై చిరంజీవి స్పందించలేదు. ముందుగా ఈ ఈవెంట్ ను ఆర్కే బీచ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేయగా.. చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. దీంతో నిర్వాహకులు ఈ వేదికను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు మార్చారు.
ప్రభుత్వ నిర్ణయంపై తానేమీ మాట్లాడలేనని, వాళ్లకు అనుకూలమైన చోట పర్మిషన్ ఇస్తారని మెగస్టార్ చిరంజీవి కామెంట్ చేశారు. కాగా, ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్ల కోసం అవసరమైతే వాలంటీర్లుగా చేయడానికి సిద్ధమని అభిమానులు చెబుతున్నారు. విశాఖలోనే కాదు రాష్ట్రంలో ఈ ఫంక్షన్ ఎక్కడ పెట్టినా సరే అక్కడికి వాలిపోతామని స్పష్టం చేస్తున్నారు.