రాహుల్ టీ షర్ట్ వెనక థర్మల్ ధరిస్తున్నారు: బీజేపీ ఆరోపణ
- రాహుల్ ఫొటోలను జూమ్ చేసి గుర్తించిన బీజేపీ లీడర్
- తపస్వి టీ షర్ట్ తో పాటు థర్మల్ వేసుకుంటున్నారని వ్యాఖ్య
- ఫొటోలను ట్విట్టర్ లో పెట్టిన బీజేపీ ఢిల్లీ నేత మజీందర్ సింగ్ సిర్సా
గజగజా వణికిస్తున్న చలిలో కూడా కేవలం టీ షర్ట్ తో జోడో యాత్ర చేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై కాంగ్రెస్ వర్గాలు ప్రశంసలు కురిపించడం తెలిసిందే. అయితే, రాహుల్ టీ షర్ట్ లోపల ‘థర్మల్’ ధరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తపస్వీ టీ షర్ట్ మాత్రమే కాదు.. దాని వెనక థర్మల్ కూడా వేసుకున్నారంటూ ఇంటర్ నెట్లో ప్రచారం జరుగుతోంది. యాత్రలో పాల్గొన్న రాహుల్ ఫొటోలను జూమ్ చేసి.. ఆయన మెడ భాగంలో టీ షర్ట్ వెనక థర్మల్ ను చూపిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే మజీందర్ సింగ్ సిర్సా ఈ ఫొటోలను ట్వీట్ చేస్తూ.. రాహుల్ గాంధీ టీ షర్ట్ వెనకున్న మతలబు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. చలికాలంలో ఎవరికైనా చలి పెడుతుందని, అది సహజమేనని సిర్సా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం తనకు చలి పెట్టదంటూ టీ షర్ట్ ధరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పబ్లిసిటీ కోసం ఆయన ఈ జిమ్మిక్కు చేస్తున్నారని మండిపడ్డారు.
మజీందర్ సింగ్ సిర్సా కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సిర్సాకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. మొహమ్మద్ జుబైర్ అనే యూజర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. బీజేపీ భక్తులు తమ నిరాశను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవి అని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ ఫొటోల్లో మెడ, ఛాతీ, ముఖాన్ని జూమ్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారని విమర్శించారు.