ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!
- ఉత్తరప్రదేశ్‌లోని బల్లార్‌పూర్ జిల్లాలో ఘటన
- స్వదస్తూరీతో విద్యార్థినికి ప్రేమ లేఖ
- విధుల నుంచి తొలగించిన స్కూలు యాజమాన్యం
- అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు
తాను గురువునన్న విచక్షణ జ్ఞానాన్ని మరిచిన ఓ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న బాలికకు ప్రేమ లేఖ రాశాడు. 47 ఏళ్ల వయసున్న ఆయన 13 ఏళ్ల బాలిక ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు జైలులో తీరిగ్గా ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత నెల 30న బాలికకు ఓ గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది.
ఉపాధ్యాయుడు స్వదస్తూరీతో రాసిన ఆ లేఖలో బాలికను ప్రేమిస్తున్నట్టుగా పేర్కొన్నాడు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నదీ అందులో వ్యక్తపరిచాడు. అది చదివిన అమ్మాయి ఆ లేఖను నేరుగా తన తల్లిదండ్రులకు ఇచ్చింది. వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా శిక్షణాధికారి ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.