పోలీసులకు జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదు... ప్రజలు: డీకే అరుణ

  • యూనిఫాం వేసుకుని బెదిరిస్తే భయపడేదిలేదన్న అరుణ
  • యూనిఫాం తీసేస్తే పోలీసులు కూడా మామూలు మనుషులని వెల్లడి
  • ప్రజలు తిరగబడితే గ్రామాల్లోకి వెళ్లలేరని వ్యాఖ్యలు
తెలంగాణలో తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై నిప్పులు చెరిగారు. "పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వం... ప్రభుత్వం అంటే ప్రజలు... పోలీసులకు జీతాలు ఇచ్చేది కేసీఆర్ కాదు.. ప్రజలు" అని స్పష్టం చేశారు. 

యూనిఫాం వేసుకుని బెదిరిస్తే భయపడేది లేదని అన్నారు. యూనిఫాం తీసేసి వస్తే మీరు కూడా మామూలు మనుషులే అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే ఊళ్లలోకి అడుగుపెట్టలేరని హెచ్చరించారు. 

పోలీసులు బీఆర్ఎస్ నేతల జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.  బీఆర్ఎస్ నేతలు దమ్ములేని దద్దమ్మలు అని, పోలీసులను ముందు పెట్టి నాటకాలు ఆడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. పోలీసుల సాయంతో కేసులు పెడతాం, మిమ్మల్ని లోపలేస్తాం అనడం కాదు... బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.


More Telugu News