అతడ్ని కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు డబ్బులు చాలేవికాదు: గంభీర్
- శ్రీలంక కెప్టెన్ దాసున్ షణకపై గంభీర్ స్పందన
- రెండో టీ20లో 22 బంతుల్లో 56 పరుగులు చేసిన షణక
- కేవలం ఒక ఓవర్ బౌలింగ్ తో రెండు వికెట్లు పతనం
శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక భారత్ తో టీ20 సిరీస్ లో ఆకర్షణగా మారాడు. రెండో టీ20 మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లో వేగంగా 56 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు, ఇదే మ్యాచ్ లో కేవలం ఒక ఓవర్ వేసి రెండు వికెట్లు తీశాడు. దీంతో ఎంత గొప్ప ఆల్ రౌండర్ అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మెంటార్ అయిన గౌతమ్ గంభీర్ భిన్నంగా స్పందించాడు.
శ్రీలంకతో సిరీస్ ఇటీవలి ఐపీఎల్ మినీ వేలానికి ముందు జరిగి ఉంటే కనుక దాసున్ షణకకు మంచి డిమాండ్ ఉండేదన్న అభిప్రాయం గంభీర్ నుంచి వ్యక్తమైంది. స్టార్ స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడిన సందర్భంగా గంభీర్ తన అభిప్రాయాలను తెలియజేశాడు. ‘‘‘నా దగ్గర (లక్నో జట్టు) అన్ని డబ్బుల్లేవు. అతడు చేసిన బ్యాటింగ్ ప్రకారం చాలా రేటు పలికేవాడు. వేలం అంతా కూడా దీనిపైనే (ఆటగాడి ప్రతిభ) ఆధారపడి కొనసాగుతుంది. ఒకవేళ ఈ సిరీస్ కనుక వేలానికి ముందు జరిగి ఉంటే కొన్ని ఫ్రాంచైజీల వద్ద అతడ్ని కొనుగోలు చేసేంత డబ్బులు కూడా ఉండేవి కావు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. అంత గొప్పగా ఆడిన షణకను మ్యాచ్ అనంతరం హార్థిక్ పాండ్యా సైతం భుజం చరిచి అభినందించడం గమనార్హం.