దేవుడు తనను కరుణించలేదని.. కక్ష కట్టిన యువకుడు!
- కష్టాలు తొలగించమని దేవుడిని ప్రార్థించిన యువకుడు
- ఎంత మొక్కినా కరుణించని దేవుడు
- నాస్తికుడిగా మారి ఆలయాలను ధ్వంసం చేసిన యువకుడు
ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా దేవుడిపైనే భారం వేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కించమని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇదే విధంగా మధ్యప్రదేశ్ కు చెందిన 24 ఏళ్ల ఒక వ్యక్తి కూడా కష్టాలను తొలగించమని దేవుడిని కోరుకున్నాడు. ఎన్ని పూజలు చేసినా ఆయన కష్టాలు మాత్రం తొలగిపోలేదు. దీంతో సదరు వ్యక్తి ఏకంగా దేవుడిపైనే కక్షను పెంచుకున్నాడు. దేవుడు లేడు అంటూ నాస్తికుడిగా మారిపోయి దేవాలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఇండోర్ నగరంలో రెండు దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ ప్రశాంత్ చౌబే మాట్లాడుతూ... చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తన కన్ను పాడయిందని, కన్ను బాగు కావాలని దేవుడిని ఎంత ప్రార్థించినా ఎలాంటి మార్పు రాకపోవడం వల్లే తాను ఈ పని చేసినట్టు ఆ వ్యక్తి చెప్పాడని తెలిపారు. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పారు. సమస్య చాలా సున్నితమైనదని... అతనిపై ఐపీసీ 295ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.