రైల్వే స్టేషన్లలో ‘యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే’ వినే ఉంటారు.. ఆ స్వరం ఈమెదే!
- ఆమె పేరు సరళా చౌదరి
- 1982లో వేలాది మందితో పోటీ పడి ఎన్నిక
- 1986లో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసిన రైల్వే
- అనంతరం ట్రైన్ మేనేజ్ మెంట్ బాధ్యతలు అప్పగింత
రైల్వే స్టేషన్లలో రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు.. యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే అంటూ హిందీలో రైళ్ల రాకపోకల సమాచారాన్ని ప్రకటించే స్వరాన్ని గుర్తు తెచ్చుకోండి. అది కంప్యూటర్ వాయిస్ అని మనం ఇంత కాలం అనుకుంటున్నాం. కానీ కాదు. సరళా చౌదరి అనే మహిళ స్వరం అది. దేశవ్యాప్తంగా చాలా స్టేషన్లలో రికార్డు చేసిన ఆమె స్వరమే వినిపిస్తుంటుంది.
1982లో అనౌన్సర్ జాబ్ కోసం సెంట్రల్ రైల్వే ప్రకటన ఇచ్చింది. వేలాది మంది పోటీ పడ్డారు. వారిలో సరళా చౌదరి కూడా ఒకరు. ఆమె స్వరం ప్రత్యేకంగా ఉండడంతో అధికారులు ఆమెకు ఆ అవకాశం కల్పించారు. దీంతో తాల్కాలిక ప్రాతిపదికన అనౌన్సర్ గా సరళా చౌదరి తన కెరీర్ ఆరంభించారు. అధికారుల అంచనాలను ఆమె ఏ మాత్రం వమ్ము చేయలేదు. ఎంతో క్యూట్ గా ఆమె చేసే అనౌన్స్ మెంట్ పట్ల ప్రయాణికులు శ్రద్ధ పెట్టి వినే వారు. ఇది రైల్వే అధికారులకు మరింత సంతృప్తిని ఇచ్చింది. దీంతో 1986లో ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారు.
నేడు సరళా చౌదరి అనౌన్సర్ గా పని చేయడం లేదు. అయినప్పటికీ గతంలో రికార్డ్ చేసిన ఆమె కంప్యూటరైజ్డ్ డిజిటల్ వాయిస్ ఇప్పటికీ చాలా స్టేషన్లలో వినిపిస్తూనే ఉంది. మధ్య మధ్యలో వేరే స్వరాలను కూడా అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఒకప్పుడు రోజూ ఎన్నో పర్యాయాలు అనౌన్స్ మెంట్లు చేయాల్సి వచ్చేది. ఎన్నో రైల్వే స్టేషన్లలో ఆమె సేవలు అందించారు. ఆ తర్వాత ట్రైన్ మేనేజ్ మెంట్ అనౌన్స్ మెంట్ బాధ్యతలను రైల్వే ఆమెకు అప్పగించింది.