చంద్రబాబుకు మానవత్వం కూడా లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
- రోడ్లపై సభలు నిర్వహించడం సరికాదన్న సజ్జల
- చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని విమర్శ
- ప్రభుత్వంపై దండయాత్ర మాదిరి కుప్పంకు బయల్దేరారని వ్యాఖ్య
ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలను నిర్వహించడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. పోలీస్ చట్టానికి లోబడే ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవోను పట్టించుకోబోమని టీడీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారని... చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు.
ప్రభుత్వంపై దండయాత్ర మాదిరి కుప్పంకు చంద్రబాబు బయల్దేరారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కందుకూరు, గుంటూరుల్లో అమాయకులు బలికావడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబుకు కనీస మానవత్వం కూడా లేదని అన్నారు. చంద్రబాబు తీరును ప్రజలంతా గమనించాలని కోరారు.