100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'ధమాకా'
- క్రితం నెల 23న విడుదలైన 'ధమాకా'
- తొలి రోజునే 10 కోట్లకి పైగా రాబట్టిన రవితేజ
- నిన్నటితో 14 రోజులను పూర్తి చేసుకున్న సినిమా
- మాస్ అంశాల వల్లనే సక్సెస్ సాధ్యమైందనే టాక్
రవితేజ నుంచి ఒక మాస్ యాక్షన్ డ్రామా కోసం ఆడియన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరహా కంటెంట్ ను అందించడానికి క్రితం ఏడాది రెండు మార్లు ప్రయత్నించినా రవితేజ విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంగా చేసిన 'ధమాకా' సినిమాను, క్రితం నెల 23వ తేదీన థియేటర్లకు తీసుకుని వచ్చాడు.
తొలిరోజునే ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, చాలా వేగంగా 90 కోట్లను రాబట్టింది. అక్కడి నుంచి కాస్త నెమ్మదించింది. నిన్నటితో ఈ సినిమా 14 రోజులను పూర్తిచేసుకుంది. 14వ రోజుతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. ఇది రవితేజ మార్కు సినిమా .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ. ఆయన నుంచి ఆడియన్స్ కోరుకున్న తరహాలో మాటలు .. పాటలు .. డాన్సులు ఉండటం వల్లనే ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.