ప్రభాస్ కి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ..: గోపీచంద్
- 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై ప్రభాస్ - గోపీచంద్
- ఒకరిని గురించి ఒకరిని అడిగిన బాలకృష్ణ
- గోపీచంద్ కి కోపమే రాదన్న ప్రభాస్
- ఆయనకి కోపం వస్తే ఒంటరిగా ఉంటాడన్న గోపీచంద్
'అన్ స్టాపబుల్ 2'లో ప్రభాస్ - గోపీచంద్ లు పాల్గొన్న సెకండ్ ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. ప్రభాస్ - గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో, ఒకరిని గురించి ఒకరి ద్వారా తెలుసుకోవడానికి బాలకృష్ణ ప్రయత్నించారు. గోపీచంద్ కి కోపం వస్తే ఏం చేస్తాడని ఆయన ప్రభాస్ ను అడిగారు.
అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. "ఒకసారి గోపీచంద్ ముక్కుకి దెబ్బ తగిలింది. నవ్వొచ్చినప్పుడు పక్కవారి భుజంపై కొట్టడం నాకు అలవాటు. అలా మాత్రం కొట్టొద్దని గోపీచంద్ నాకు ముందుగానే చెప్పాడు. కానీ కలిసి కారులో వెళుతూ ఉండగా నాకు నవ్వు రాగానే నేను అతని భుజంపై గట్టిగానే కొట్టాను .. అంతే పాపం ముక్కులో నుంచి రక్తం వచ్చేసింది. అప్పుడు కూడా తను నన్ను ఏమీ అనలేదు. తనకి కోపం రాదు .. చాలా మంచోడు" అని అన్నాడు.
ఇక ప్రభాస్ కి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అని గోపీచంద్ ను బాలయ్య అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ .. " ప్రభాస్ కి కోపం వస్తే తనచుట్టూ ఉన్నవారిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటాడు .. గెటవుట్ అనేస్తాడు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతాడు" అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలకి ప్రభాస్ నవ్వేశాడు.