గుడిపల్లి పీఎస్ నుంచి చంద్రబాబు ప్రచార రథాన్ని తరలించిన పోలీసులు.. టీడీపీ శ్రేణుల ఆందోళన
- కుప్పంలో మూడో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
- తొలి రోజే ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- మరో ట్రక్కుకు తాళ్లు కట్టి రథాన్ని తరలించిన వైనం
కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగనుంది. రాత్రి ఆయన కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. స్థానికుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
మరోవైపు చైతన్య రథాన్ని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్ కు చంద్రబాబు వస్తారనే భావనతో రథాన్ని రాత్రి పోలీసులు తరలించారు. ప్రచార రథాన్ని వేరే ట్రక్కుకు తాళ్లతో కట్టి అక్కడి నుంచి మరో ప్రదేశానికి తరలించారు. మైకు ఉన్న మరో వాహనాన్ని మాత్రం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ వాహనాన్ని కూడా భారీ వాహనాల పక్కన నిలబెట్టారు. ప్రచార రథాన్ని తరలించారనే వార్తతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రథాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.