అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ వృథా... భారత్ ఓటమి
- పూణేలో టీమిండియా వర్సెస్ శ్రీలంక
- శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు
- టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 రన్స్
- 31 బంతుల్లో 65 పరుగులు చేసిన అక్షర్
పూణేలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక విసిరిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. విజయానికి దగ్గరగా వచ్చి 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఓ దశలో భారత్ 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా... అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చారు. అయితే జట్టు స్కోరు 148 పరుగుల వద్ద సూర్యకుమార్ వెనుదిరిగాడు. సూర్య 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు.
ఆ తర్వాత శివమ్ మావి అండతో అక్షర్ పటేల్ తన దూకుడు కొనసాగించాడు. అయితే చివరి ఓవర్లో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా, అక్షర్ ఓ ఫుల్ టాస్ ను కొట్టబోయి లాంగాన్ లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ ఆశలు అడుగంటాయి. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 3 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. శివమ్ మావి 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశాడు.
శ్రీలంక బౌలర్లలో మధుశంక 2, కసున్ రజిత 2, కెప్టెన్ దసున్ షనక 2. కరుణరత్నే 1, హసరంగ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 7న రాజ్ కోట్ లో జరగనుంది.