రెండో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా... శ్రీలంకకు శుభారంభం
- పూణేలో జరుగుతున్న మ్యాచ్
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక
- తొలి వికెట్ కు 80 పరుగులు జోడించిన లంక ఓపెనర్లు
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 పూణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ జోడీ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించింది.
అయితే ఈ జోడీని చహల్ విడదీశాడు. అర్ధసెంచరీ సాధించిన కుశాల్ మెండిస్ (52)ని ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. ఆ తర్వాత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఓ చక్కటి బంతితో భానుక రాజపక్సను బౌల్డ్ చేయడంతో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం శ్రీలంక 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. పత్తుమ్ నిస్సాంక 29, చరిత్ అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ ద్వారా రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.