నా ఆలోచనా విధానాన్ని మార్చిన సినిమా 'అన్నమయ్య': సుమన్
- యాక్షన్ హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన సుమన్
- ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ
- పౌరాణిక చిత్రాలలో మెప్పించిన ప్రత్యేకత
- 'ఆన్నమయ్య' సినిమా అద్భుతాలు చేసిందని వ్యాఖ్య
యాక్షన్ హీరోగా సుమన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తనవైపుకు తిప్పుకున్నారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలలోను నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికీ తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన 'అన్నమయ్య' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఆ సినిమా చేస్తున్నప్పుడు నన్ను చూసిన వాళ్లంతా వేంకటేశ్వర స్వామి మాదిరిగానే అనిపిస్తున్నారని అనేవారు. దాంతో నాలోను ఆ స్వామిపై భక్తి పెరుగుతూ వెళ్లింది. ఆ పాత్రను నేను చేయడానికి కారణం కూడా ఆ స్వామినే అనిపించింది. ఏ విషయాన్ని గురించి కూడా బాధపడటం మానేశాను. అలా నా ఆలోచనా విధానాన్ని ఆ సినిమా మార్చేసింది.
'అన్నమయ్య' సినిమా విడుదలైన తరువాత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారితో కలిసి, రాష్ట్రపతి భవన్ లో కూర్చుని సినిమా చూసే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటి ఒక అరుదైన సంఘటన నా విషయంలో జరిగింది. అలా జరిగేలా చేయడం మానవ మాత్రుల వలన కాలేదు .. ఆ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే ఇదంతా సాధ్యమైందని నేను నమ్ముతాను" అంటూ చెప్పుకొచ్చారు.