పాపం శాంసన్.. గాయంతో టీ20 సిరీస్ కు దూరం
- తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలికి గాయం
- విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
- అతని స్థానంలో విదర్భ కీపర్ జితేశ్ శర్మకు చోటు
ఎంతో ప్రతిభావంతుడైన భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ను దురదృష్టం వెంటాడుతోంది. టాలెంట్ ఉన్నప్పటికీ సరైన టీం మేనేజ్ మెంట్ అతనికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. శ్రీలంకతో టీ20 సిరీస్ లో అతనికి అవకాశం ఇస్తే అతడిని దురదృష్టం వెంటాడింది. ముంబైలో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ శాంసన్ గాయపడ్డాడు. బంతిని ఆపే సమయంలో డైవ్ చేయడంతో అతని మోకాలికి దెబ్బ తగిలింది. వైద్య పరీక్షల్లో గాయం పెద్దది అని తేలింది.
దాంతో, వైద్యులు అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో చివరి రెండు టీ20 మ్యాచ్ ల నుంచి శాంసన్ తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. శాంసన్ స్థానంతో విదర్భకు చెందిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను సెలెక్టర్లు టీ20 జట్టులో చేర్చారని వెల్లడించింది. జితేశ్ భారత జట్టుకు ఎంపికవడం ఇదే మొదటిసారి.