లే ఆఫ్‌ల బాటపట్టిన అమెజాన్.. 18 వేల మందిపై వేటు!
- 10 వేల మందినే ప్రకటిస్తామని గతంలో ప్రకటించిన అమెజాన్
- ఇప్పుడా సంఖ్యను 18 వేలకు పెంచిన ఈ-కామర్స్ దిగ్గజం
- అకస్మాత్తు ప్రకటన వెనక కారణం చెప్పిన సీఈవో జెస్సీ
ఆర్థిక మాంద్యానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఇటీవల ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు ఆ తర్వాత అన్ని కంపెనీలకు పాకింది. కంపెనీలన్నీ ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. ఆ తర్వాత కొద్దిపాటి విరామం లభించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
అంతలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు మరో షాకింగ్ విషయాన్ని షేర్ చేసింది. మరో 18 వేల మందిని తొలగిస్తున్నట్టు చెబుతూ ఉద్యోగులకు నిన్న మెసేజ్‌లు పంపింది. అది చూసిన ఉద్యోగులు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఆర్థిక అస్థిరతను కారణంగా చూపుతూ అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు.
కాగా, 10 వేలమందిని తొలగించనున్నట్టు నవంబరులో ప్రకటించగా, ఇప్పుడా సంఖ్యను 18 వేలకు పెంచడం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో నియమించుకున్న ఉద్యోగులపై ఎక్కువగా వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా తప్పలేదని, ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన తెలిపారు.
ఉద్యోగాలు కోల్పోయే వారికి తమ మద్దతు కొనసాగుతుందని, సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వంటి ప్యాకేజీలు సహా బయట ఉద్యోగం చూసుకునేందుకు అవసరమైన మద్దతు ఇస్తామని జెస్సీ పేర్కొన్నారు. కొన్ని లే ఆఫ్‌లు ఐరోపాలో ఉంటాయన్న జెస్సీ.. ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు సమాచారం అందిస్తామన్నారు.
తమ సహోద్యోగి ఒకరు లే ఆఫ్‌ల విషయాన్ని లీక్ చేయడంతో ఈ విషయాన్ని అకస్మాత్తుగా ప్రకటించాల్సి వచ్చిందని జెస్సీ తెలిపారు. గతేడాది సెప్టెంబరు నాటికి అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్ల మంది ఉద్యోగులున్నారు. సీజన్ ఉద్యోగులు వీరికి అదనం.