మాజీ ఎంపీ పొంగులేటికి షాకిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం
- సెక్యూరిటీని తగ్గించిన ప్రభుత్వం
- కొంత కాలంగా సొంత పార్టీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్న శ్రీనివాస్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ఇటీవల వ్యాఖ్య
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న 3 ప్లస్ 3 భద్రతను 2 ప్లస్ 2 కు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించింది. అంతేకాదు, ఆయన ఇంటి ముందు ఉండే గన్ మెన్ ను, ఆయనకు ఉన్న ఎస్కార్ట్ ను కూడా తొలగించింది. కొంత కాలంగా సొంత పార్టీ బీఆర్ఎస్ తో శ్రీనివాస్ రెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
అలాగే, బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తానే కాకుండా, తన అనుచరులు కూడా పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సెక్యూరిటీని తగ్గించారనే చర్చ జరుగుతోంది.