నాగ్ చేతుల మీదుగా 'పాప్ కార్న్' ట్రైలర్ రిలీజ్!

  • మరో ప్రేమకథా చిత్రంగా 'పాప్ కార్న్'
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్ 
  • సంగీత దర్శకుడిగా శ్రావణ్ భరద్వాజ్ 
  • ఫిబ్రవరి 10వ తేదీన సినిమా రిలీజ్ 
తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'పాప్ కార్న్'. అవికా - సాయి రోనక్ జంటగా నటించిన ఈ సినిమాను, ఆచార్య క్రియేషన్స్ - అవికా స్క్రీన్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. మురళి గంధం ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. నాగార్జున చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. హీరో - హీరోయిన్ ఒక మాల్ లో ఉండగా బాంబు పేలుడు సంభవిస్తుంది. ఇద్దరూ కూడా ఆ మాల్ లోని లిఫ్టులో చిక్కుకుంటారు. ఆ లిఫ్ట్ లో నుంచి .. ఆ మాల్ లో నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది కథ.

ఇక్కడి యూత్ లో అవికాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఈ లవ్ స్టోరీ యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఇక్కడ అవికా పుంజుకుంటుందేమో చూడాలి..


More Telugu News