లావుగా ఉన్నావు గేమ్స్ ఆడొచ్చు కదా అన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి... అమ్మ ఫోన్ ఇవ్వడంలేదన్న బాలుడు
- గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహించిన కేతిరెడ్డి
- బాలుడు చెప్పిన సమాధానంతో అవాక్కయిన వైనం
- సెల్ ఫోన్ గేమ్స్ కాదు గ్రౌండ్ కు వెళ్లి గేమ్స్ ఆడాలని సలహా
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఉదయాన్నే నియోజవకర్గంలోకి వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పట్లాగానే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓ బాలుడు చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. కేతిరెడ్డి పార్టీ కార్యకర్తలు వెంటరాగా గ్రామంలో ముందుకు సాగారు. ఓ ఇంటి ముందు నిలుచున్న బాలుడ్ని చూసి ఆగారు.
ఎమ్మెల్యే: ఏం చదువుతున్నావమ్మా?
బాలుడు: 8వ తరగతి చదువుతున్నాను.
ఎమ్మెల్యే: ఏందిరా... అంతా లావుగా అయిపోయావు!.. గేమ్స్ ఆడుకోవా?
బాలుడు: ఆడుకోను.
ఎమ్మెల్యే: గేమ్స్ ఆడుకోవా... ఎందుకని... ఏం?
బాలుడు: అమ్మ సెల్ (ఫోన్) ఇవ్వదు.
ఎమ్మెల్యే: అమ్మ సెల్ ఇవ్వదా?... సెల్ ఫోన్ లో కాదురా గేమ్ ఆడమనేది... గ్రౌండ్ కు వెళ్లి గేమ్ ఆడాలి.
బాలుడు: ఆడతాను సర్.
ఎమ్మెల్యే: ఏం గేమ్ ఆడతావు?
బాలుడు: కబడ్డీ ఆడతాను సర్.
ఎమ్మెల్యే: కబడ్డీ ఆడి అందరినీ ఎత్తిపడేయడానికా...? వేరే గేములు ఆడు... గ్రౌండ్ లో నాలుగు రౌండ్లు పరిగెత్తు.
... అంటూ సలహా ఇచ్చిన ఎమ్మెల్యే అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.